సీజేఐపై దాడి.. అడ్వొకేట్ రాకేశ్‌పై FIR నమోదు
సీజేఐ BR గవాయ్‌పై ఈ నెల 6న షూ విసిరి దాడికి పాల్పడిన అడ్వొకేట్ రాకేశ్ కిషోర్‌పై బెంగళూరులో జీరో FIR నమోదయింది. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భక్తవత్సల ఫిర్యాదుతో విధానసౌధ పోలీసులు BNS 132, 133 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్ శిక్షార్హుడని, వెంటనే చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ కేసును పోలీసులు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పీఎస్‌కు బదిలీ చేశారు.
Comments