ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ‘ఉమెన్ వింగ్’ ఏర్పాటు
పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ‘జమాత్-ఉల్-మోమినాత్’ పేరిట మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసింది. జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ దీనికి నాయకత్వం వహించనుంది. ఆమె భర్త, ఉగ్రవాది యూసుఫ్ మేలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో హతమయ్యాడు. జైషే కమాండర్ల భార్యలతో పాటు బహవల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మెన్‌సెహ్రా ప్రాంతాల్లో చదివే మహిళలే టార్గెట్‌గా రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Comments