ఏ దేవుడి దర్శనానికి ఏ రంగు దుస్తులు ధరించాలి?
ఆధ్యాత్మిక నియమాల ప్రకారం.. దైవ దర్శనానికి కొన్ని రంగుల దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘లక్ష్మీదేవి, సరస్వతి, శివుడి దర్శనానికి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. గణేశుడి గుడికి వెళ్తే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి పసుపు రంగు దుస్తులు ఉత్తమం. అయ్యప్ప స్వామి దర్శనానికి నలుపు ధరించాలి. ఫలితంగా దైవానుగ్రహం లభిస్తుంది’ అని అంటున్నారు.
Comments