గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం!
తెలంగాణ : బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు ఆర్టీసీ మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో హైదరాబాద్ పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
Comments