గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరు?
తులసీ దేవి, గణేషుణ్ని చూసి తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది. కానీ నిరాకరిస్తాడు. దీంతో ఆమె కోపంతో బ్రహ్మచారిగా ఉంటావని శపిస్తుంది. ప్రతిగా గణేషుడు ఆమెను రాక్షసుని చెంత ఉండమని శపించాడు. ఆయన శాపానికి చింతించిన ఆమె మన్నించమని అడిగింది. గణేషుడు శాంతించి పవిత్రమైన మొక్కగా జన్మిస్తావని వరమిస్తాడు. కానీ తన పూజలో ఆ పత్రం ఉండటాన్ని నిరాకరిస్తాడు. ఆయన పూజలో తులసి ఆకులు వాడితే పూజాఫలం దక్కదని ప్రతీతి.
Comments