మోనో క్రోమ్ మేకప్ గురించి తెలుసా?
కొట్టొచ్చినట్లు కనిపించే మేకప్ చాలామందికి నచ్చదు. అలాంటి వారికోసమే వచ్చింది మోనోక్రోమ్ మేకప్. దీంట్లో ముఖం, కళ్లు, పెదాలకు ఒకే రంగును ఉపయోగిస్తారు. దీనివల్ల నేచురల్ లుక్ వస్తుంది. ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేసిన తర్వాత లేత గులాబీరంగు లిప్‌స్టిక్, అలాగే లేత గులాబీ బ్లష్, ఐ మేకప్ వేస్తే చాలు. ఇదే కాకుండా సీజన్‌తో సంబంధం లేకుండా అన్నివేడుకలకూ సరిపడే మరో రకం న్యూడ్ మేకప్.
Comments